ఇలియానా చేసిన తప్పే కీర్తిసురేశ్‌ కూడా చేస్తోందా?

  • In Film
  • July 22, 2019
  • 142 Views
ఇలియానా చేసిన తప్పే కీర్తిసురేశ్‌ కూడా చేస్తోందా?

 ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరోయిన్ల జాబితాలో కీర్తిసురేశ్‌ పేరు అగ్రస్థానంలో ఉంటుంది. తెలుగు,తమిళంలో కీర్తి నటించిన చిత్రాలు బ్లాక్‌బస్టర్లు కావడంతో యూత్‌లో కీర్తికి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది.మహానటి చిత్రానికి ముందు అంతంత మాత్రంగానే ఉన్న కీర్తిసురేశ్‌ క్రేజ్‌ మహానటి చిత్రం అనంతరం ఆకాశానికి చేరుకుంది.మహానటి తెచ్చిన క్రేజ్‌తో తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ కీర్తి సురేష్ మాత్రం వస్తున్న ప్రతి అవకాశాన్ని రిజెక్ట్ చేస్తోందట. కథ నచ్చలేదని సాకులు చెబుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల తెలుగులో స్టార్ హీరో సరసన నటించే అవకాశం రాగా తన పాత్రకు ప్రాధాన్యత లేదని పక్కకు తప్పుకుందట.ఇలా కీర్తి సురేష్ వరుసగా సినిమాలు రిజెక్ట్ చేయడానికి కారణం కథ నచ్చకపోవడం కాదని వేరే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ త్వరలో శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మించబోయే చిత్రంలో నటించనుంది. చిత్రం కోసం ఒళ్ళు హూనం చేసుకుని బక్కచిక్కిపోయింది. ఇకపై బాలీవుడ్ చిత్రాల్లో నటించడం కోసం ముంబైలోనే ఉండాలని కీర్తి సురేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఉన్న అవకాశాలు వదిలేసి బాలీవుడ్ లో ఇబ్బందులు పడడం ఎందుకనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఇలియానా కూడా ఇలాగే చేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఇలియానా బాలీవుడ్ లో ఒకటి రెండు హిట్లు పడగానే సౌత్ ని వదిలేసింది.అంతటితో ఆగకుండా దక్షిణాదిలో తనకు సరైన గుర్తింపు రాలేదని,సరైన పాత్రలు రాలేదని కేవలం గ్లామర్‌ పాత్రలే దక్కాయని ఇలా దక్షిణాదిపై నోరు పారేసుకుంది.ఫలితంగా ప్రస్తుతం అవకాశాలు లేక ఫోటోషూట్లు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది.కీర్తిసురేశ్‌ ప్రవర్తన చూస్తుంటే ఇలియాన తరహాలోనే ఉందని ఇది ఇలాగే కొనసాగితే ఇలియానకు పట్టినగతే కీర్తిసురేశ్‌కు కూడా పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos