కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ తిరస్కరణ..

కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ తిరస్కరణ..

 కర్ణాటక రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం సోమవారం బలపరీక్ష ఎదుర్కొంటున్న నేపథ్యంలో బలపరీక్షకు సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కీలకనిర్ణయం వెల్లడించింది.సోమవారం బలపరీక్ష నిర్వహించాల్సిందేనని ఆదేశాలు జారీ చేయాలంటూ కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.సోమవారం సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆదేశాలను వెల్లడించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ర్మాసనం తేల్చిచెప్పింది.గత విధానసభ ఎన్నికల్లో హావేరి జిల్లా రాణిబెన్నూరు,కోలారు జిల్లా ముళబాగిలు నియోజకవర్గాల నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలిచిన శంకర్‌,నగేశ్‌లు గతంలో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.దీంతో ఇద్దరిలో శంకర్‌కు అటవీశాఖ మంత్రి పదవిని కూడా అప్పగించారు.అయితే కొద్ది ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాలతో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికారు.దీంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామా చేసిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో కలసి ముంబైలో ఉంటున్నారు.కాగా ఎమ్మెల్యేల రాజీనామాతో నాలుగు రోజులుగా బలపరీక్ష నుంచి తప్పించుకుంటున్న సంకీర్ణ ప్రభుత్వం సోమవారం కూడా బలపరీక్ష తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.ఈ నేపథ్యంలోనే సోమవారం ఎట్టిపరిస్థితుల్లోనూ బలపరీక్ష నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయాలని స్వతంత్ర ఎమ్మెల్యేలు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ర్మాసనం ఇప్పటికిప్పుడు విచార చేపట్టడానికి నిరాకరించింది. మరోవైపు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కుమారస్వామి చివరి ప్రయత్నాలకు దిగారు. సందర్భంగా జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలకు ఆయన లేఖ రాశారు. బీజేపీ ఉచ్చులో పడొద్దని .. సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందామని లేఖలో పేర్కొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos