31న ప్రారంభం
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో 31న పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ తెలిపారు. మహబూబాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సీహెచ్.శివలింగయ్యతో కలిసి పోస్టుమాస్టర్ జనరల్ ఆకాష్ దీప్ చక్రవర్తి, రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ విష్ణుతో కలిసి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటుపై చర్చించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భవనాన్ని పోస్టాఫీసుకు తీసుకుని ఉన్నందున పోస్టల్ శాఖ వారికి పాస్‌పోర్ట్ కేంద్రం ఏర్పాటుకు అనుగుణంగా ఉంటుందని దాన్ని కేటాయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో (ప్రభుత్వ బాలికల కళాశాల, పాఠశాలకు ఆనుకుని ఉన్న) భవనాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్, ఎంపీ భవన మరమ్మతులు త్వరితగతిన చేపట్టి 25లోగా పూర్తి చేసి పాస్‌పోర్ట్ కేంద్రం ఏర్పాటుకు అనువుగా ఉండేలా మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా… పోస్టల్ శాఖ నుంచి రూ.3 లక్షలు అందజేయనున్నట్లు పోస్టుమాస్టర్ జనరల్ ఆకాష్ దీప్ చక్రవర్తి తెలపగా మిగిలిన నిధులు తన సీడీఎఫ్ నుంచి మంజూరు చేయనున్నట్లు ఎంపీ తెలిపారు. వెంటనే స్పందించి ప్రభుత్వ భవనాన్ని కేటాయించినందుకు వారు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.