కరెంటు బిల్లలు షాకిచ్చాయట..

  • In Film
  • July 17, 2019
  • 147 Views
కరెంటు బిల్లలు షాకిచ్చాయట..

 వెండితెరపై అందాలు ఆరోబోస్తూ హాట్‌హాట్‌గా కనిపిస్తూ ప్రేక్షకుల మతిపోగొట్టే హీరోయిన్‌ లక్ష్మీరాయ్‌కి ప్రతీనెలా విద్యుత్‌శాఖ తన ఇంటికి ఇస్తున్న కరెంటు బిల్లులు చూసి మతిపోతోందట.ఒకనెలలో ఎంతైతో బిల్లు కడుతుందో మరుసటి నెల అంతకు రెండింతలు బిల్లు వస్తోందని గత మూడు నెలలుగా ఇదే తంతు జరుగుతోందంటూ లక్ష్మీరాయ్‌ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.‘‘కొన్ని నెలలుగా మాకు వస్తున్న కరెంట్ బిల్లును పరిశీలిస్తున్నాను. మంత్ నేను ఎంత బిల్ పే చేస్తున్నానో.. దానికి డబుల్ బిల్ మరుసటి నెల వస్తోంది. ఇలా గత మూడు నెలలుగా జరుగుతోంది. దీనిపై కంప్లయింట్ ఇవ్వడానికి ఆదాని ఎలక్ట్రిసిటీ టోల్ ఫ్రీ నెంబర్కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫలితం లేదు. నాలా ఎంతమంది ప్రజలు సమస్యతో బాధపడుతున్నారో..అని తలుచుకుంటే ఆశ్చర్యమేస్తోంది. సమస్య నుంచి నన్నెవరైనా గట్టెక్కించండి. కష్టపడి డబ్బు సంపాదించి ఇలా కట్టాలంటే నాకు ఎంతో బాధగా ఉంది..’’ అని రాయ్ లక్ష్మీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారుయ్ లక్ష్మీ సమస్యను తెలుసుకున్న ఆదాని ఎలక్ట్రిసిటీ బోర్డ్.. ‘‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. దయచేసి మీ అకౌంట్ నెంబర్, కాంటాక్ట్ వివరాలను డైరెక్ట్ మెసేజ్ చేయగలరు. మీ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాము..’’ అని లక్ష్మీరాయ్‌ ట్వీట్కు రిప్లై ఇచ్చింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos