కన్నడ రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభానికి తెర దించుతూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఎం కుమారస్వామిపై,సుప్రీంకోర్టు తీర్పు స్పందించారు.ఇప్పటికీ తనకు ఎమ్మెల్యేలంతా మద్దతు తెలుపుతున్నారనే భ్రమలో సీఎ కుమారస్వామి ఉన్నారంటూ విమర్శించారు. ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు వెల్లడించిందని తీర్పు వెల్లడయ్యాక కూడా గురువారం రోజు అవిశ్వాత తీర్మానానికి కుమారస్వామి ఎలా సిద్ధమవుతున్నారో అర్థం కావడం లేదన్నారు.ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉండాలని కుమారస్వామి అనుకుంటున్నారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.స్పీకర్ రమేష్ కుమార్ మీద తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నామని బీఎస్, యడ్యూరప్ప చెప్పారు. స్పీకర్ నిర్ణయం తీరువాత తాము ఏం చెయ్యాలో ఆలోచిస్తామని బీఎస్. యడ్యూరప్ప అన్నారు.మరో నేత జగదీశ్శెట్టర్ మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడానికి వేచి చూడకుండా సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చెయ్యాలని మాజీ ముఖ్యమంత్రి, డిమాండ్ చేశారు. బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ సీఎం కుమారస్వామి మీద, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని అన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఈ సంకీర్ణ ప్రభుత్వానికి లేదని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ చెప్పారు.మెజారీటీ ఎమ్మెల్యేల మద్దతు లేని సీఎం కుమారస్వామి రాజీనామా చెయ్యడమే మంచిదని ఈ సంకీర్ణ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయని, వెంటనే ఇంటికి పోవడం వారికే మంచిదంటూ మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు..