నా ట్రస్ట్ ద్వారానే వైద్య సేవలు అందిస్తా..

  • In Film
  • July 17, 2019
  • 118 Views
నా ట్రస్ట్ ద్వారానే వైద్య సేవలు అందిస్తా..

 సినీహీరో,దర్శకుడు రాఘవ లారెన్స్‌ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు.తాను ఇంతటి స్థాయికి ఎదగడానికి కారణమైన ప్రజలకు ఎంతో్కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి అనేక మందికి వైద్య సహాయం చేసిన రాఘవ లారెన్స్‌ వైద్యసహాయం కోసం తనను వెతుక్కుంటూ వచ్చి చిరునామా తెలియక భిక్షాటన చేస్తున్న కుటుంబాన్ని ఆదుకున్నారు.రాజైపాళెం ప్రాంతానికి చెందిన గృహలక్ష్మీ అనే మహిళ తన కొడుకు సూర్యకు గుండె జబ్బు ఉన్నట్లు తెలుసుకొని వైద్యం కోసం చాలా ప్రయత్నించారు. అయితే భర్త కూడా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో గృహలక్ష్మీకి కష్టాలు మరింత రెట్టింపయ్యాయి.ఈ సమయంలో గృహలక్ష్మి తమ్ముడు వెంకటేశన్‌ పెళ్లిని సైతం వదులకొని అక్కకు తోడుగా నిలిచాడు. అయినప్పటికీ సూర్యకు నయం కాకపోవడంతో ఇరుగుపొరుగు వ్యక్తులు ఇచ్చిన సూచన మేరకు ఐదు రోజుల క్రితం లారెన్స్‌ను వెతుక్కుంటూ చెన్నై నగరానికి వచ్చారు.అయితే లారెన్స్‌ చిరునామా లభించకపోవడంతో తిరిగి వెళ్లలేక స్థానిక ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లో భిక్షాటన చేస్తూ గడుపుతున్నారు.ఈ కుటుంబం దీనస్థితిపై స్థానిక పత్రిక వార్త ప్రచురించడంతో ఈ విషయం కాస్త రాఘవ దృష్టికి వెళ్లింది.దీంతో ఆ కుటుంబాన్ని తీసుకురావాల్సిందిగా తన అనుచరులను ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌కు పంపించారు.ఎగ్మూర్ రైల్వే స్టేషన్ కి వెళ్లిన వారు లారెన్స్ పంపించారని చెప్పి అతడిని ఇంటికి తీసుకువెళ్లారు. తరువాత నటుడు లారెన్స్ వారిని కలిసి పరామర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సహాయం కోసం తనను వెతుక్కుంటూ చెన్నై వచ్చారని తెలిసి బాధపడ్డానని చెప్పారు. పిల్లాడి సమస్య ఏంటనేది తెలుసుకొని వీలైనంత వరకూ తన ట్రస్ట్ ద్వారానే వైద్య సేవలు అందిస్తానని, తనకు సాధ్యం కాకపోతే ప్రభుత్వాన్ని సాయం కోరతానని చెప్పారు

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos