ప్రపంచ కప్పు తీరుపై బిగ్ బీ వ్యంగ్యోక్తి

  • In Sports
  • July 16, 2019
  • 193 Views
ప్రపంచ కప్పు తీరుపై బిగ్ బీ వ్యంగ్యోక్తి

ముంబై : ప్రపంచ కప్పు ఫైనల్లో అత్యధిక బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం పట్ల బాలీవుడ్ అగ్ర శ్రేణి నటుడు అమితాబ్ బచ్చన్ విస్మయం వ్యక్తం చేశారు. వ్యంగ్య ధోరణిలో ఐసీసీ నిర్ణయాన్ని విమర్శించారు. ఇద్దరు వ్యక్తుల వద్ద చెరో రూ.2000 ఉంటే, వాళ్లిద్దరిలో ధనవంతుడు ఎవరు? అంటూ తన ట్వీట్ మొదలు పెట్టిన అమితాబ్, దానికి అద్భుతమైన ముగింపునిచ్చారు. ఒకరి వద్ద రూ.2000 నోటు ఉండగా, మరొకరి వద్ద నాలుగు రూ.500 నోట్లు ఉన్నాయని, ఐసీసీ ప్రకారం ఎక్కువ నోట్లు ఉన్న వ్యక్తే ధనవంతుడు అంటూ సెటైర్ వేశారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల స్కోర్లు టై కాగా, సూపర్ ఓవర్ లో సైతం స్కోర్లు సమం అయ్యాయి. దాంతో, బౌండరీలు ఎక్కువగా బాదిన జట్టుగా ఇంగ్లండ్‌ ప్రపంచకప్పు ఎగరేసుకెళ్లింది. ఈ బౌండరీల నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos