మంచి రోడ్లు కావాలంటే…టోల్ కట్టాల్సిందే

ఢిల్లీ : ప్రజలు మంచి రోడ్లు కావాలనుకుంటే టోల్ కట్టాల్సిందేనని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్‌సభలో  మంగళవారం ఆయన సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉన్నంత కాలం టోల్ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుందన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం 40 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందని వెల్లడించారు. టోల్ వ్యవస్థ వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. టోల్ ద్వారా వసూలు చేసిన నిధులను గ్రామీణ, కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నామని గడ్కరీ తెలిపారు. మెరుగైన సేవలు కావాలంటే ప్రజలు టోల్ కట్టాల్సిందేనని, ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos