బాలయ్యతో పింక్ రీమేకా?

  • In Film
  • July 6, 2019
  • 97 Views
బాలయ్యతో పింక్ రీమేకా?

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌,తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్’ సినిమా హిందీలో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.. ఇదే చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తుండగా అమితాబ్‌ పాత్రలో అజిత్‌,తాప్సీ పాత్రలో జెర్సీ ఫేమ్‌ శ్రద్ధా శ్రీనాథ్‌లు నటిస్తున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్‌ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.రీమేక్‌ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు ఈ తెలుగులో అమితాబ్‌ పాత్రను బాలకృష్ణతో చేయించడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.చాలా కాలంగా బాలయ్యతో సినిమా తీయాలని అనుకుంటున్న దిల్‌రాజు ఈ చిత్రంతో తన కోరికను తీర్చుకోవడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos