తెలంగాణలో అన అధిపత్యాన్ని,అధికారాన్ని ప్రశ్నించే,ఎదురించే పార్టీయే లేదంటూ బీరాలు పలుకుతూ మితి మీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కేసీఆర్‌కు లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కొంచెం భయాన్ని పుట్టించాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో కారుకు పదహారు వస్తాయంటూ ధీమగా ఉన్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు గట్టి షాకిచ్చారు.కేసీఆర్ ఊహించని విధంగా ఇంకా చెప్పాలంటే బీజేపీ కూడా ఊహించని విధంగా తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాల్ని బీజేపీ ఖాతాలో వేసిన తెలంగాణ ఓటర్ల నిర్ణయంతో కమలనాథుల్లో కొత్త ఆశలు.. కొంగొత్త ఆకాంక్షలు షురూ అయ్యాయి. తాము ఇప్పటివరకూ సరైన రీతిలో ప్రయత్నం చేయలేదు తప్పించి.. తమను ఆదరించటానికి.. అభిమానం చూపించటానికి.. అందలం ఎక్కించటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని అర్థం చేసుకున్న కమలనాథులు.. తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించారు.తమ కన్ను పడిన క్షణం నుంచి ప్రత్యర్థులకు కౌంట్ డౌన్ మొదలెట్టే అలవాటున్న కమలనాథులకు.. తమకు చెమటలు పట్టేలా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావుడి చేసిన కేసీఆర్ సంగతి చూడాలని మోడీషా ద్వయం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో.. తెర వెనుక మొదలైన మంత్రాంగాన్ని మొదలు పెట్టిన వైనాన్ని కేసీఆర్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. తన తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న గులాబీ నేతలను టచ్ లోకి తీసుకుంటున్న కమలనాథులు.. కొత్త కొత్త హామీలు ఇవ్వటం షురూ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో.. మొన్నటి వరకూ తమకు ఎదురే లేదని ఫీలైన కేసీఆర్ సైతం ఇప్పుడు కాస్త అసౌకర్యానికి గురి అవుతున్నట్లు చెబుతున్నారు.తాము పవర్లోకి వచ్చిన తర్వాత పదవుల గురించి అడగటానికి సైతం సాహసించని నేతలు పలువురు..బీజేపీ అండతో కేసీఆర్‌పై కొద్ది కొద్దిగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నట్లు సమాచారం.ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ గొంతు విప్పడం మొదలుపెట్టినట్లు సమాచారం.మరి మోదీషా ద్వయం ఎత్తుకు కేసీఆర్ ఎటుంవంటి పైఎత్తు వేస్తారోనని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..