న్యూ ఢిల్లీ: రాహుల్ గాంధీ గత బుధవారం సాధారణ పౌరుడిలా సామాన్యుడిలా దిల్లీలోని ఒక థియేటర్లో ‘ఆర్టికల్ 15’ సినిమా వీక్షించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా సంచరిస్తోంది. ఇందులో పాప్కార్న్ తింటూ పక్క సీట్లో వారితో కబుర్లు చెబుతూ సరదాగా కనిపించారు. రాహుల్ సినిమా చూస్తున్న దృశ్యాలను అదే థియేటర్లో ఉన్న ఓ వ్యక్తి సెల్ఫోన్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఇది సంచలనమైంది. ‘ఎటువంటి హడావుడి లేకుండా ఓ సాధారణ పౌరుడిలా రాహుల్ సినిమా వీక్షించడం నిజంగా గొప్ప విషయం’ అని కొందరు . ‘ఓవైపు అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టాలని నేతలు తర్జనభర్జనలు పడుతుంటే మరోవైపు రాహుల్ తాపీగా రిలాక్స్ అవుతున్నారు’ అని మరి కొందరు విమర్శించారు.