సరిహద్దులో పాక్‌ కాల్పులు

సరిహద్దులో పాక్‌  కాల్పులు

జమ్మూ: జమ్మూ- కశ్మీర్, రాజౌరి జిల్లా నౌషెరా సెక్టారులోని సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికులు శుక్రవారం రాత్రి కాల్పులు జరిపారు. పొరుగు దేశ సైనికులు మోర్టార్లతో దాడి చేయడంతో అప్రమత్తమైన భారత సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. దాడిని భారత సైనికులు సమర్ధంగా తిప్పికొట్టారు. దీంతో పాక్ సైనికులు పారి పోయారు. పుల్వామా దాడి, బాలాకోట్ లో వాయుసేన దాడుల అనంతరం పాక్ తరచూ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడుతోంది. కాల్పుల్లో ఎవరూ గాయపడ లేదని భారత రక్షణ దళాల పౌర సంబంధాల శాఖ అధికారి తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos