కరాచీలో భారత కాన్సులేట్‌ కబ్జా

కరాచీలో భారత కాన్సులేట్‌ కబ్జా

న్యూ ఢిల్లీ: పాకిస్థాన్, కరాచీలో మూసి వేసిన భారత కాన్సులేట్ భవనం ఆక్రమణలకు గురయిందని పాక్కు భారత్ ఫిర్యాదు చేసింది. భవనం నుంచి ఆక్రమణదారులను తొలగించాలని కోరింది.ముంబైలో1993 లో సంభవించిన పేలుళ్లకు కరాచీ కేంద్రంగానే కుట్ర జరిగింది. దీనికి నిరసనగా భారత్ అక్కడి కార్యాలయాన్ని మూసి వేసింది. అక్కడి ప్రైవేటు భద్రతా బలగాల్ని బెదిరించి గుర్తు తెలియని వ్యక్తులు భవన వరణలోకి ప్రవేశించినట్లు స్థానికులు తెలిపారు. ఒకప్పుడు వీసా దరఖాస్తు దారులు వేచి ఉండేందుకు కట్టిన వెనుక భవనాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. పరిసరాలు అపరిశుభ్రంగా మారి మద్యం,మాదక ద్రవ్యాలు సేవించే వారి అడ్డాగా మారిందని స్థానికులు చెప్పారు. పాక్ ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇలాంటి ఆక్రమణలు జరిగాయంటే నమ్మశక్యంగా లేదని అక్కడ పని చేసిన భారత్ చివరి కాన్సులర్ జనరల్ రాజీవ్ డోగ్రా వ్యాఖ్యానించారు. 1990లోనూ జరిగిన ఇలాంటి ప్రయత్నాల గురించి చర్చించటానికి భారత్ ఒక ప్రత్యేక ప్రతినిధిని ఇస్లామాబాద్ పంపిందన్నారు. కరాచీలో భారత్కు చెందిన నాలుగు విలువైన భవనాలు ఉన్నాయని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos