హైదరాబాద్ : భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన 3.30 గంటల వరకు సీఐఎస్‌ఎఫ్ అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 4.30 గంటలకు కేఎల్‌సీ ఫంక్షన్ హాలులో జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు. పహాడీ షరీఫ్ పరిధిలోని రంగనాయక తండాలో ఓ గిరిజన కుటుంబానికి ఆయన పార్టీ సభ్యత్వం ఇవ్వనున్నారు. రాత్రి 7.15 గంటలకు నోవాటెల్‌లో తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాత్రి 9 గంటలకు తిరిగి వెళతారు.