లక్ష్మీదేవి తలుపు తట్టింది…

లక్ష్మీదేవి తలుపు తట్టింది…

తిరువనంతపురం : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివాసం ఉండే కేరళకు చెందిన సోప్నా నాయర్ ఊహించని విధంగా ఐశ్వర్యవంతురాలయ్యారు. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహించే లాటరీలో బుధవారం ఆమెను అదృష్ట దేవత వరించింది. గతంలో ఆమె పలు సార్లు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసినప్పటికీ బహుమతి లభించలేదు. ఇటీవల మళ్లీ అదృష్టాన్ని పరీక్షించదలచుకున్నారు. భర్తకు తెలియకుండా టికెట్ కొనుగోలు చేశారు. డ్రాలో 3.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.22 కోట్లు) బహుమతి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గెలుచుకున్న మొత్తంలో కొంత నిరుపేదలను ఆదుకోవడానికి, మిగిలినది తన కుటుంబ పోషణకు కేటాయిస్తానని సోప్నా తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos