కోర్టు ధిక్కరణ : ముగ్గురు అధికారులకు జైలు శిక్ష

హైదరాబాద్: కోర్టు ధిక్కరణకు పాల్పడిన ముగ్గురు అధికారులకు హైకోర్టు జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. పునరావాసం కల్పించకుండానే చట్టవిరుద్ధంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు చేస్తున్నారంటూ సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్కు చెందిన 70 మంది వ్యవసాయ కార్మికులు గతేడాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పునరావాసం కల్పించకుండా పనులు చేపట్టవద్దని హైకోర్టు గతేడాది జులై 25న ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు పనులు చేస్తున్నారంటూ తాజాగా వేములఘాట్కు చెందిన 17 మంది కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు మూడో యూనిట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా ఉన్న సిద్దిపేట ఆర్డీవో జయచంద్రా రెడ్డి, తొగుట తహసీల్దార్ ఎల్.వీర్ సింగ్, నీటి పారుదల శాఖ గజ్వేల్ డివిజన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ టి.వేణులకు మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అప్పీల్ చేసుకోవడానికి వీలుగా శిక్షను ఆరు వారాల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos