చెన్నై : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న నళినికి హైకోర్టు శుక్రవారం నెల రోజుల పాటు పెరోల్‌ను మంజూరు చేసింది. తన కుమార్తె పెళ్లి ఏర్పాట్ల కోసం ఆరు నెలల పాటు పెరోల్ మంజూరు చేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. అయితే డివిజన్ బెంచ్ నెల రోజుల పెరోల్ మంజూరు చేస్తూ, పలు షరతులు విధించింది. వెలుపల ఉన్న సమయంలో ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, రాజకీయ నాయకులను కలుసుకోరాదని న్యాయమూర్తులు ఆంక్షలు విధించారు. 1991 మే 21న ఎల్టీటీఇ ఉగ్రవాదులతో కలసి ఆమె భర్త మురుగన్ రాజీవ్ గాంధీని హత్య చేయడానికి వ్యూహ రచన చేశారు. ఈ కేసులో వీరంతా దోషులుగా తేలడంతో 27 ఏళ్లుగా శిక్షను అనుభవిస్తున్నారు. మురుగన్ శ్రీలంక జాతీయుడు.