బడ్జెట్ వెనుక పదేళ్ల ముందుచూపు

బడ్జెట్ వెనుక పదేళ్ల ముందుచూపు

ఢిల్లీ : వచ్చే పదేళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లోక్‌సభలో శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆమె ఉన్నతాధికారులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశామని, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు. పట్టణాల్లో జీవన ప్రమాణాలు పెరగడానికి బడ్జెట్‌ తోడ్పాటుగా ఉంటుందన్నారు. మధ్య తరగతి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. స్టార్టప్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలను ఇచ్చామని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్‌ వాహనాలకు ప్రోత్సాహం కల్పించినందున, భవిష్యత్తులో వాహనాల తయారీ పరిశ్రమల సంఖ్య పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యర్థాలను విద్యుత్‌ శక్తిగా మార్చడానికి చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos