ఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో ఈసారి వరాల కన్నా వాతలే ఎక్కువగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రజాగ్రహానికి గురి కాకుండా మోదీ ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఇప్పుడు అసలు, వడ్డీ ముక్కు పిండి వసూలు చేయనుంది. పెట్రోలు, డీజిల్పై లీటరుకు రూపాయి చొప్పున అదనపు సెస్ విధించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇప్పటికే రోజువారీ సమీక్షల పేరుతో రోజుకు నాలుగైదు పైసలు చొప్పున పెంచుకుంటూ పోతున్నారు. తద్వారా వాటి ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటాయి. పేరుకు రూపాయి అయినా, సంవత్సరానికి మన మీద పడే భారమెంతో లెక్కలు వేసుకుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. లీటరుకు రూపాయి చొప్పున సెస్ అంటే…రోజుకు ప్రభుత్వానికి రూ.200 కోట్ల రాబడి సమకూరుతుంది. ఏడాదికిది రూ.72 వేల కోట్లు. రూపాయి పెంపు భారం ఇంకా…రవాణా ఛార్జీలు, నిత్యాసర సరుకుల మీద కూడా పడడం ఖాయం. మొత్తానికి సామాన్యుని నడ్డి విరగడం కూడా ఖాయమే.