న్యూఢిల్లీ : ఐటీ ఇన్‌ఫ్రా, సర్వీసుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం కమాండ్, కంట్రోల్ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)తో కలిసి ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గురువారం నాడు ఢిల్లీలో కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఐటీ సిస్టమ్ సేవలు, లోపాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఈ సెంటర్ దోహదపడనుంది. ప్రజలకు అందిస్తున్న డిజిటల్ సేవల సమాచారాన్ని కూడా పరిశీలించేందుకు ఇది తోడ్పాటునందించనుంది. కాగా ప్రభుత్వ శాఖల్లో సాంకేతిక సేవలను మరింతగామెరుగుపరిచేందుకు ఎన్‌ఐసీ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను రవి శంకర్ ప్రసాద్ ప్రారంభించారు.