విజయవాడ:బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వచ్చేల 48 గంటల్లో వాయు గుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం ఇక్కడ తెలిపింది. ఇందువల్ల సోమ, మంగళవారాల్లో తెలంగాణ, కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో పలు చోట్ల సాధారణం కంటే ఎక్కువ వానలు పడే అవకాశం ఉంది. అల్ప పీడనం ప్రభావం వల్ల తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. జాలర్లు చేపల వేటకు సముద్రంలోకి వెళ్ల రాదని హెచ్చరించింది.