ముంబై : మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వినోద రంగంలో కాలు మోపాడు. హాట్ స్టార్ స్పెషల్స్ కొత్త సిరీస్ `ది ఆఫీస్’లో నటించబోతున్నాడు. ఇదే పేరిట వచ్చిన అంతర్జాతీయ సిరీస్ దీనికి మాతృక. ఫరీదాబాద్ సమీపంలోని ఓ కాగితం పరిశ్రమ ఉద్యోగుల జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ది ఆఫీస్ 13 ఎపిసోడ్లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ కంపెనీ ఉద్యోగం కోసం వెళ్లడం, ఉద్యోగులతో మాట్లాడడం లాంటి విషయాల గురించి యువీ మీడియాకు వివరించాడు. ఉద్యోగులతో మాట్లాడడం ఆసక్తిగా అనిపించిందని, తన జీవితంలో ఇలాంటి ఆసక్తిని ఎప్పుడూ చూడలేదని వివరించాడు. క్రికెట్‌కు విశ్రాంతి పలికినా, ఆటకు మాత్రం పూర్తిగా దూరం కాబోనని తెలిపాడు.