ఇలా తలుపు మూయవచ్చు…తెరవనూ వచ్చు

ఇలా తలుపు మూయవచ్చు…తెరవనూ వచ్చు

సాధారణంగా గది లేదా ఇంటి తలుపులు తెరవడం, మూయడంపై తరచూ చిన్నపాటి ఘర్షణలే జరుగుతుంటాయి. తలుపు తెరచిన తర్వాత మూయకుండా వెళితే కొందరికి చికాకు కలిగిస్తుంటుంది. తలుపును తెరచినా దానంతట అదే మూసుకోవడానికి హైడ్రాలిక్‌ పరికరం అవసరం అవుతుంది. దీనికి రూ.1,500 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఓ వ్యక్తి రూ.2 ఖర్చుతో అలాంటి సదుపాయాన్ని కల్పించాడు. దీనికి ప్లాస్టిక్‌ బాటిల్‌ను ఉపయోగించాడు. ఈ ఆలోచనను మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్‌ మెచ్చుకోవడమే కాకుండా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఇప్పుడది వైరల్‌గా మారింది. తాను వాట్సాప్‌లో నిత్యం ఎన్నో చూస్తుంటానని, అయితే దైనందిన జీవితంలో సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తానని ఆయన పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos