కియాలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

కియాలో  75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

అనంతపురం: పెనుకొండలోని కియా కార్ల కర్మాగారంలోని మొత్తం ఉద్యోగాల్లో 75 శాతాన్ని స్థానికులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జారీ చేసిన ఆదేశాలకు సంస్థ యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని వెనుకబడిన వర్గాల సంక్షేమ మంత్రి మంత్రి శంకర నారాయణ శనివారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు.ఇంకా కియాకు భూములు ఇచ్చిన 375 కుటుంబాలకు ఉద్యోగాలు కచ్చితంగా ఇచ్చి తీరాలనే సూచననూ అంగీకరించినట్లు చెప్పారు. అంతకు ముందు కర్మాగారాన్ని సందర్శించారు. మంత్రి వెంట పాటు కలెక్టర్ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్ డిల్లీ రావు, ఇతరు అధికారులు ఉన్నారు.ఉద్యోగాల భరోసా గురించి కియా యాజమాన్యం చేసిన ప్రకటనతో భూములిచ్చిన రైతులు ఆనందాన్ని వ్యక్తీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos