తెలంగాణలో ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపు

తెలంగాణలో ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపు

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో తాత్కాలికంగా ఫీజులు పెరిగాయి. దీనిపై తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) చేసిన ప్రతిపాదనను కళాశాలల యాజమాన్యాలు అంగీకరించాయి. శనివారం ఇక్కడ ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో 15 నుంచి 20 శాతం ఫీజులను పెంచడానికి టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదించింది. రూ.50 వేల లోపు ఉన్న ఫీజులను 20 శాతం, అంతకు మించి ఉన్న ఫీజులను 15 శాతం పెంచడానికి చేసిన ప్రతిపాదనకు అంగీకారం లభించింది. నెల రోజుల్లో పూర్తి స్థాయి ఫీజులను ఖరారు చేయనున్నారు. మధ్యంతర పెంపు ప్రతిపాదనను ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు అంగీకరించాయని ఉన్నత విద్యా మండలి తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos