తిరుపతి : ‘సుజనా, సిఎం. రమేష్లు చంద్రబాబు నాయుడు బినామీలు. చంద్రబాబు అనుమతితోనే వారంతా భాజపాలో చేరారని’ మంత్రి శంకర నారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఫిరాయింపులన్నీ 2024 శాసనసభ ఎన్నికల్పి ఎదుర్కోవడానికి చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలని దుయ్యబట్టారు.అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారంతా భాజపాలో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను జగన్ ప్రభుత్వం సాధించి తీరుదుందని విశ్వాసాన్ని వ్యక్తీకరించారు.