తప్పుడు వార్తల పై చర్చించాలి

తప్పుడు వార్తల పై చర్చించాలి

న్యూఢిల్లీ: విద్వేష పూరితంగా ప్రసారం చేస్తున్న తప్పుడు వార్తలు, సమాచారం గురించి పార్లమెంటులో చర్చ జరగాలని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జావ్దేకర్ పేర్కొన్నారు. నకిలీ వార్తలపై కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ లోక్సభలోఅడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ‘హాని తలపెట్టేలా ప్రసారం చేసే తప్పుడు వార్తలు, నకిలీ సమాచారం చాలా ముఖ్యమైన అంశాలు. వీటిపై సభలో చర్చ జరగాల న్నా’రు.  ప్రత్యేకించి సామాజి మాధ్యమాలు, మెసేజింగ్ యాప్ల ద్వారా వ్యాప్తిచెందుతున్న పుకార్లు, నకిలీ వార్తలను అరికట్టేలా చట్టాలకు పదునుపె ట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే ఒత్తిడి ఉంది. ‘నకలీ వార్తలకు’ వాట్సప్ వేదికగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos