ముంబై: స్టాక్ మార్కెట్ శుక్రవారం కుప్పకూలాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పాటు విదేశీ పెట్టుబడుల మళ్లింపు కొనసాగడం మార్కెట్ సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీశాయి. కీలక రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ట్రేడింగ్‌ను శుక్రవారం నష్టాలతో మొదలయ్యాయి. మార్కెట్ ఆరంభంలో 130 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. చివరి గంటల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు భారీగా నష్ట పోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 407 పాయింట్లు దిగజారి 39,194 వద్ద, నిఫ్టీ 108 పాయింట్ల నష్టంతో 11,724 వద్ద నిలిచింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.55 గా దాఖలైంది. ఎన్‌ఎస్‌ఈలో యస్ బ్యాంక్, మారుతి సుజుకీ, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటార్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. టెక్ మహింద్రా, యూపీఎల్ లిమిటెడ్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, హిందాల్కో, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి.