పెద్ద పెద్ద ఫంక్షన్లలో వెల్లుల్లి వినియోగం ఎక్కువగానే ఉంటుంది. అయితే దాని పొట్టు తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ముందుగా పొట్టుని ఒలిచి, తర్వాత వెల్లుల్లిని వేరు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కెనడాకు చెందిని ఓ మహిళ చిన్నపాటి చాకు సాయంతో వెల్లుల్లిని చకచకా బయటకు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియోను విపెస్టిలెంజ్ అనే మహిళ ట్విటర్‌లో పోస్టు చేసింది. పోస్టు చేసిన కొద్దిసేపటికే ఆ వీడియో వైరల్‌గా మారింది. మూడు రోజుల్లోనే 2.1 కోట్ల మందికి పైగా నెటిజన్లు దీనిని తిలకించారు. కామెంట్లు, లైక్‌ల లెక్కలు సరేసరి. మీరూ చూడండి…
As someone who makes a lot of Korean food, this is the best method for getting garlic peeled!
👌 pic.twitter.com/14GGJDQhRj— 𝖛𝖆𝖑𝖊𝖓𝖙𝖎𝖓𝖆 ✣ 𝖑𝖔𝖗𝖉 🌑 (@VPestilenZ) June 17, 2019