రమేశ్‌ రాజకీయ దళారి

రమేశ్‌ రాజకీయ దళారి

కడప:తెదేపా నుంచి  భాజపాలోకి ఫిరాయించిన రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేశ్‌ రాజకీయ దళారి అని మాజీ శాసనసభ్యుడు వరద రాజులు రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘సీఎం రమేష్ ఎన్ని ఆగడాలు చేసినా చంద్రబాబు నాయుడు పట్టించుకో లేదు.  తన ప్రయోజనాల కోసమే సీఎం రమేష్ పార్టీ మారారు. కడప జిల్లాలో తెదేపా  దారుణంగా ఓటమి పాలు కావడానికి సీఎం రమేష్ కారణం. చంద్రబాబు నాయుడు రాజకీయ బ్రోకర్లను తన వెంట పెట్టుకోవడం వల్లే తెదేపా దారుణంగా ఓటమి పాలైందని’ ఘాటుగా వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos