జైలు శిక్ష తప్పించుకునేందుకే భాజపాలోకి

జైలు శిక్ష తప్పించుకునేందుకే భాజపాలోకి

అమరావతి:‘సుజనా చౌదరి బ్యాంకులను నిండా ముంచేశారు. ఇప్పుడు తీహార్ జైలుకు పోకుండా ఉండేందుకే భాజపాలో చేరారని’ తెదేపా నేత వర్ల రామయ్య శుక్ర వారం ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. సుజనా, సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ లు పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోతారని తమకు ముందే తెలుసన్నారు. వారంతా తెదేపాను చంద్రబాబును ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదిగారని పేర్కొన్నారు. ఆరోపించారు. తెదేపా శాసనసభ్యులు ఎవ్వరూ భాజపాలో చేరబోరని ఆశించారు. ‘సీఎం రమేశ్, సుజనా చౌదరి ఇద్దరూ ఇద్దరే. తీహార్ జైలు కంటే భాజపాలో చేరడమే మేలని భావించారని’ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్నప్పుడు నలుగురు నేతలు దొంగ దెబ్బ కొట్టారనీ, ఇందుకు అంతకంత అనుభవిస్తారన్నారు. సుజనా బ్యాంకుల దోపిడీ దాఖలాలు సీబీఐ దగ్గర ఉన్నాయన్నారు. ఏక పార్టీ వ్యవస్థ దేశానికి పెనుముప్పు అని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos