ఢిల్లీ : రాజకీయ కారణాలతో పార్టీని వీడాలనుకున్నవారికి ఏమైనా చెప్పవచ్చని, ఆర్థికపరమైన కారణాలతో వెళ్లాలనుకున్నవారికి ఏం చెప్పగలమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వీడనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఇక్కడ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి ఏ కారణాలతో వెళుతున్నారో తనకు చెప్పారని, ఇప్పుడు ఆయన ఏదైనా చెప్పవచ్చని అన్నారు. కాగా పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ఆయన స్పందిస్తూ, గత అయిదేళ్లలో తెలంగాణకు ఏమీ రాలేదని, ఈసారి కూడా రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనబడడం లేదని విమర్శించారు. భాజపాను పొగడడానికే ప్రసంగమంతా సరిపోయిందని ఎద్దేవా చేశారు.