కేరళ నుంచి చల్లటి కబురు

ఢిల్లీ : నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. రుతుపవనాల ఆగమనానికి అనువైన వాతావరణం ఏర్పడిందన్నారు. వీటి ప్రభావంతో ఈ నెల 9న కొల్లాం, అలప్పులా జిల్లాలు, 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. అరేబియా సముద్రం నైరుతి భాగాన అల్లకల్లోలంగా మారనుందని, కనుక మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఈ వారాంతం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos