అవరసమైతే ప్రపంచకప్‌ను బహిష్కరిద్దాం..

  • In Sports
  • June 7, 2019
  • 227 Views
అవరసమైతే ప్రపంచకప్‌ను బహిష్కరిద్దాం..

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం భారత క్రికెట్‌ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడి విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని వాడిని చేతి గ్లోవ్స్‌పై వివాదం రోజురోజుకు ముదురుతోంది.2011లో టెరిటోరియల్‌ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్‌ హోదా పొందిన ధోనీ..ప్రత్యేక భద్రతా దళాలకు గౌరవ సూచకంగా…ఆ బలాల ఆత్మ బలిదాన చిహ్నం బాకును తన కీపింగ్‌ గ్లోవ్స్‌పై వేయించుకున్నాడు.అదే గ్లోవ్స్‌తో ఈ నెల 5న సౌతాఫికాతో మ్యాచ్‌లో ఆడాడు.దక్షిణాఫ్రికా ఆటగాడు ఫెలుక్‌వాయోను స్టంపౌట్‌ చేయడం ద్వారా ఈ గ్లౌజ్‌పై ఉన్న చిహ్నం అందరికంటా పడింది. అయితే ధోని గ్లౌజ్‌పై ఈ చిహ్నం ఉండటాన్నితప్పుబట్టిన ఐసీసీ  వెంటనే ధోనితో ఆ లోగోను తీయించాల్సిందిగా బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్‌ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరామని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ (కమ్యూనికేషన్స్‌) ఫర్లాంగ్‌ బీసీసీకి విజ్ఞప్తి చేశారు.దీంతో భారత అభిమానులు ఐసీసీపై విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.గ్లోవ్స్‌పై బలిదాన్‌ చిహ్నం అలాగే ఉంచాలని దేశం మొత్తం నీకు మద్దతు పలుకుతోందని అవసరమైతే ప్రపంచకప్‌ను బహిష్కరిద్దాం కానీ దేశగౌరవం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ కమెంట్లు పోస్ట్‌ చేస్తున్నారు.మరికొంత మంది ధోని గ్లోవ్‌ నుంచి ఆ చిహ్నం తీసేయవచ్చేమో కానీ.. అతని గుండెలో నుంచి తీసేయలేరని, ఐసీసీ సిగ్గుపడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ లోగో విషయంలో ఐసీసీ ఒత్తిడి చేస్తే.. ప్రపంచకప్‌ టోర్నీ నుంచి స్వచ్చందంగా నిష్క్రమించి మరో ఐపీఎల్‌ ఆడుకుందామని బీసీసీఐకి సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా ధోని గ్లోవ్స్‌ నుంచి బల్దియాన్‌ లోగో తీసేస్తే ప్రపంచకప్‌ మ్యాచ్‌లు వీక్షించవద్దని పిలుపునిస్తున్నారు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సైతం తమ టీషర్టులపై మూడు సింహాల లోగో వేసుకున్నారని, అది కూడా ఆ దేశ సైనికుల త్యాగానికి చిహ్నమేనంటున్నారు. మనకు ఆటకన్నా దేశ గౌరవం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఐసీసీ సంపదలో 80 శాతం వాటా మనదేనని, టోర్నీ నుంచి నిష్క్రమిస్తానంటే ఐసీసీ దారిలోకి వస్తుందని కామెంట్‌ చేస్తున్నారు. అంతే కాదు అభిమానులు,సగటు భారతీయులతో పాటు సహచర ఆటగాళ్లు, వివిధ క్రీడా ప్రముఖులు కూడా ధోనీకి మద్దతుగా నిలుస్తున్నారు. ధోనీ గ్లోవ్స్‌ విషయంలో ఐసీసీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos