ఫిబ్రవరి 1 నుంచి శిరస్త్రాణం ధరించాలి

కరీంనగర్‌: కరీంనగర్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి హెల్మెట్‌ వినియోగాన్ని అమలు చేయనున్నామని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.బి కమలాసన్‌రెడ్డి అన్నారు. మంగళవారం కమిషనరేట్‌ కేంద్రంలో హెల్మెట్‌ వినియోగం, ఈ-చలాన్‌ విధానంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ వి.బి కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌లు ధరించకపోవడం వల్లే తలకు గాయాలై మృత్యువాత పడుతున్నారని, హెల్మెట్‌లు ధరించినట్లయితే 99 శాతం ప్రమాదాల్లో వాహనదారులు మృతిచెందే అవకాశం ఉండదని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ యజమానులు మృతి చెందడం వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయని, మరికొందరు బలమైన గాయాలలో జీవచ్ఛవాలుగా మారి దుర్భర జీవితాలను గడుపుతున్నారని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos