కథానాయకుడు సినిమాలో రామోజీ పాత్ర ఇదీ….

—————————————————————————————————————————————-
టీడీపీని ఏర్పాటు చేసే ముందు రామోజీరావు పాత్ర ఏమిటీ? ఎన్టీఆర్ రామోజీరావు మధ్య ఎలాంటి సంభాషణలు చోటు చేసుకొన్నాయి?ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసే ముందు ఎవరెవరితో మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడనే అంశాలను ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాలో బాలకృష్ణ తెరకెక్కించారు.
—————————————————————————————————————————————-
హైదరాబాద్: టీడీపీని ఏర్పాటు చేసే ముందు రామోజీరావు పాత్ర ఏమిటీ? ఎన్టీఆర్ రామోజీరావు మధ్య ఎలాంటి సంభాషణలు చోటు చేసుకొన్నాయి?ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసే ముందు ఎవరెవరితో మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడనే అంశాలను ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాలో బాలకృష్ణ తెరకెక్కించారు.
సినీ రంగంలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని సర్ధార్ పాపారాయుడు సినిమా షూటింగ్ సమయంలో అనుకొన్నారు. ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేయగానే ఏపీ నుండి వేలాది ఉత్తరాలు ఎన్టీఆర్‌కు వచ్చినట్టు సినిమాలో తెరకెక్కించారు.
ఏపీ రాష్ట్రంలో ఆ సమయంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తమ బాధలను చెప్పుకొంటూ ప్రజలు లేఖలు రాశారు. ఈ లేఖలను చదివిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయానికి వచ్చారు. తిరుపతికి వచ్చిన భక్తులు మద్రాసులో ఉండే ఎన్టీఆర్‌ను చూసేందుకు వచ్చిన సమయంలో ఏపీలో చోటు చేసుకొన్న పరిస్థితులను ఎన్టీఆర్‌కు ఏకరువు పెట్టేవారని ఈ సినిమాలో చూపించారు.
భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరయ్యారు. ఆ సమయంలోనే నాదెండ్ల భాస్కర‌రావుతో ఎన్టీఆర్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఆ తర్వాత పార్టీ ఏర్పాటు వరకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి వ్యతిరేకంగా నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ వద్ద వ్యాఖ్యలు చేసినట్టుగా ఈ సినిమాలో చూపారు.
రాజకీయపార్టీ ఏర్పాటు విషయమై చర్చలు సాగుతున్న తరుణంలో ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు ఎన్టీఆర్‌ను కలిసి ఈ విషయమై చర్చించినట్టుగా ఈ సినిమాలో చూపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను కూడ పత్రికను ఏర్పాటు చేసిన విషయాన్ని రామోజీరావు వ్యాఖ్యానించినట్టుగా ఈ సినిమాలో తెరకెక్కించారు.
ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేయడానికి ముందు రామోజీరావుతో ఫోన్లో మాట్లాడినట్టుగా సినిమాలో చూపారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నాదెండ్ల భాస్కర రావుకు చెప్పాలని రామోజీరావుతో ఎన్టీఆర్ మాట్లాడినట్టుగా ఈ సినిమాలో సన్నివేశాలను చిత్రీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos