ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లును ఆహ్వానిస్తున్నాం: చంద్రబాబు

ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లును ఆహ్వానిస్తున్నాం: చంద్రబాబు

దిల్లీ: ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లును ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు రిజర్వేషన్‌ ప్రతిపాదనలను కేంద్రానికి పంపాయన్నారు. ఆ ప్రతిపాదనలను పట్టించుకోకుండా ఈ బిల్లును తీసుకొచ్చారని పేర్కొన్నారు. అయినా కానీ తాము ఈ బిల్లును ఆహ్వానిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 19న కోల్‌కత్తా ర్యాలీకి మమతా బెనర్జీ ఆహ్వానించినట్లు వెల్లడించారు. అక్కడ జరిగే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. అందరు కలిసి జాతీయ స్థాయిలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos