వరంగల్: లాటరీ పేరుతో కోటి రూపాయలకు టోకరా వేసిన ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, 23 మొబైల్ ఫోన్లు, విదేశీ పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వివిధ బ్యాంక్ ఖాతాల్లోని 28 లక్షల లావాదేవీలను నిలిపివేశారు. వీరిద్దరిని ఢిల్లీలో అరెస్ట్ చేశామని, నేరస్థులు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని వరంగల్ సీపీ రవీందర్ స్పష్టం చేశారు.