పారిపోయిన బీజేపీ ఎమ్మెల్యే

లక్నో: చలికాలంలో పేదలకు కంబళ్లు పంచుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు కంబళ్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ కంబళ్లను అందుకునేందుకు జనం పోటీ పడటంతో గందరగోళం చెలరేగింది. జనం చేతికందినన్ని కంబళ్లను పట్టుకుని పారిపోసాగారు. వీటిని దక్కించుకోలేని వారంతా గొడవకు దిగారు. వివరాల్లోకి వెళితే బస్తీ జిల్లాలోని కప్తాన్‌గంజ్ చౌరస్తా సమీపంలో బీజేపీ ఎమ్మెల్యే సీపీ శుక్లా ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని అనంతరం ఎమ్మెల్యే పేదలకు కంబళ్లు పంపిణీ చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న జనం అక్కడికి పెద్ద ఎత్తున తరలిరాసాగారు. వీరంతా కంబళ్లను అందుకునేందుకు పోటీ పడసాగారు. దీంతో సదరు ఎమ్మెల్యే అక్కడి నుంచి వేగంగా వెళ్లి తన కారులో కూర్చుని వెళ్లిపోయారు.
Tags : woollen clothes, Uttarpradesh, bjp mla..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos