‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..’

  • In Film
  • January 8, 2019
  • 1024 Views
‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..’

హైదరాబాద్‌: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. అలనాటి నటుడు ఎన్టీ రామారావు జీవితాధారంగా తెరకెక్కిన ‘యన్‌టిఆర్‌’ చిత్రంలోని తొలి భాగం ‘కథానాయకుడు’ బుధవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లు, పాటలు, ప్రోమోలతో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ‘కథానాయకుడు’ చిత్రంలోని ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..’ అనే పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది.

ఈ పాటలో తన తండ్రి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారు. దాదాపు 50 ఏళ్ల క్రితం ఈ పాటను దివంగత సాహిత్య రచయిత వేములపల్లి శ్రీకృష్ణ రాశారు. ఇప్పుడు ఈ పాటను ‘యన్‌టిఆర్‌’ చిత్రంలో వాడారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విద్యాబాలన్‌ బసవతారకం పాత్రలో నటించారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్‌ షోను అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం ఈరోజు ప్రదర్శించనున్నారు. రెండో భాగమైన ‘యన్‌టిఆర్‌: మహానాయకుడు’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలయ్య నిర్మాతగా వ్యవహరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos