రెండు సార్లు‌ కంపించిన జపాను

రెండు సార్లు‌ కంపించిన జపాను

టోక్యో: జపాన్‌లో శుక్రవారం ఉదయం రెండు భారీ భూ కంపాలు ప్రజలను భయ భ్రాంతులకు గురి చేశాయి. మియాజకి నగరానికి తూర్పు ఆగ్నేయంగా తొలిసారి 5.1 తీవ్రతతో పసిఫిక్ జలాల్లో 35 కిలోమీటర్ల లోతున, రెండోసారి మళ్లీ ఇదే ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపాల వల్ల సునామీ ముప్పు లేదని జపాన్ వాతావరణ విభాగం తెలిపింది. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని స్థానిక మీడియా పేర్కొంది. 2011లో జపాన్‌లో సంభవించిన భూకంపం వల్ల 15 వేల మంది మృతి చెందారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos