‘అయోధ్య’ కేసు విచారణ మరోసారి వాయిదా

‘అయోధ్య’ కేసు విచారణ మరోసారి వాయిదా

న్యూఢిల్లీ: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం సమస్య సామరస్య పరిష్కారానికి తగిన సిఫార్సుల్ని చేసేందుకు మధ్యవర్తిత్వ సమితికి అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆగస్టు 15 వరకు గడువు నిచ్చింది. మే ఏడున సమితి 13,500 పుటల మధ్యంతర నివేదిక సమర్పించింది. సామరస్య, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు మరింత సమయం కావాలని సమితి చేసిన వినతికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. మధ్యవర్తిత్వ సమితి కార్యకలాపాలన్నీ రహస్యమైనవని, వాటిని బహిర్గతం చేయబోమని ధర్మాసనం తేట తెల్లం చేసింది.ఆ సమితి కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోరాదని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో రెండు వర్గాలకు ఏమైనా అభ్యంతరాలుంటే జూన్‌ 30లోగా సమితి దృష్టికి తీసుకు రావాలని సూచించింది. అయోధ్య భూ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు గత మార్చి 8న అత్యున్నత న్యాయస్థానం నివృత న్యాయమూర్తి ఎఫ్‌.ఎం.ఖలీఫుల్లా, జీవన కళ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచులతో సమితిని నియమించింది. ఎనిమిది వారాల పాటు సమితి ఫైజాబాద్‌లో చర్చలు జరిపి నివేదిక రూపొందించింది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos