ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష

సియోల్‌ : ఉత్తర కొరియా గురువారం ప్యాంగ్యాంగ్‌లో రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించింది. వారం కిందటే దీర్ఘ శ్రేణి బహుళ రాకెట్‌ లాంచర్లు, వ్యూహాత్మక గైడెడ్ ఆయుధాలను పరీక్షించింది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను దక్షిణ కొరియా ఆర్మీ వెల్లడించింది. అణ్వస్త్ర సమస్యపై చర్చించడానికి అమెరికా దౌత్యవేత్త దక్షిణ కొరియాకు వచ్చిన సందర్భంగా ఉత్తర కొరియా ఈ పరీక్షను నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తర కొరియా భూభాగం మీదుగా ఓ క్షిపణి 420 కిలోమీటర్లు, మరో క్షిపణి 270 కిలోమీటర్లు దూసుకెళ్లాయని తెలిపింది. అయితే ఈ పరీక్షల వివరాలు దక్షిణ కొరియా అంచనాలు మాత్రమేనని తెలుస్తోంది. గత ఫిబ్రవరిలో వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోన్‌ ఉంగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా అణ్వాయుధ వ్యాప్తి నిరోధకంపై వారిద్దరి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అమెరికాపై ఒత్తిడి తీసుకు రావడానికే ఉత్తర కొరియా ఇటువంటి పరీక్షలు చేస్తోందని భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos