అధికారిక కార్యక్రమాలకే రాజీవ్ యుద్ధనౌక వాడారు

అధికారిక కార్యక్రమాలకే రాజీవ్ యుద్ధనౌక వాడారు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను సొంత ట్యాక్సీలా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా గురువారం విలేఖరుల సమావేశంలో ఇక్కడ ఖండించారు. అధికారిక కార్యక్రమాల కోసమే తప్ప విహారం కోసం ఎప్పుడూ రాజీవ్ యుద్ధ నౌకను వాడ లేదని స్పష్టీ కరించారు. తన పనులు చెప్పుకుని ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం లేకే రాజీవ్ గాంధీపై మోదీ అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘ప్రధాని మోదీ చెప్పింది అబద్ధమని విశ్రాంత వైస్ అడ్మిరల్ వినోద్ పాస్రిచా దృశ్య మాధ్యమాలకు చెప్పారు. అధికారిక కార్యక్రమాల కోసమే రాజీవ్ అందులో ప్రయాణించారు తప్ప అది విహార యాత్ర కాదు. మోదీకి నిజాలు ఏమీ పట్టవు’ అని మండి పడ్డారు. తన ‘వైఫల్యాలపై’ ఓట్లు అడుగుతున్న ఏకైక ప్రధాని మోదీ యేనని ఎగతాళి చేసారు. ‘పుల్వామా ఘటనకు నిఘా వ్యవస్థ ఘోర వైఫల్యమే కారణం. అయినా దాని పైనే మోదీ ధైర్యంగా ఓట్లు అడుగుతున్నారు’అని ఎద్దేవా చేశారు. నోట్లరద్దు, నిరుద్యోగం, రాఫెల్ ఒప్పందం సహా తాము లేవ నెత్తిన సమస్యలపై చర్చకు వచ్చేందుకు మోదీకి ధైర్యం సరి పోవడం లేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos