గౌరి హత్యతో సాధ్వీకి సంబంధం లేదు

గౌరి హత్యతో సాధ్వీకి సంబంధం లేదు

న్యూఢిల్లీ: జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యతో భోపాల్‌ భాజపా అభ్యర్థి సాధ్వీ  ప్ర జ్ఞా సింగ్‌ ఠాకూర్‌కి సంబంధం లేదని దర్యాప్తు సంస్థ(సిట్) తేల్చి చెప్పింది. ఆమె ప్రమేయమున్నట్టు విచారణలో తాము ఎక్కడా గుర్తించలేదని గురువారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కోర్టుకు సమర్పించిన పత్రాలలో ఆమె ప్రమేయాన్ని రుజువు చేసే ఆధారాలు ఎక్కడా లభించలేదని పేర్కొంది. 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన స్వగృహంలో గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీనితో పాటు 2015లో హత్యకు గురైన ఎంఎం కల్బుర్గీ కేసును కూడా దర్యాప్తు చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో సిట్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos