షార్ట్‌ వేసుకోవడం మరచిపోయావా?

  • In Film
  • May 8, 2019
  • 200 Views
షార్ట్‌ వేసుకోవడం మరచిపోయావా?

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రామ్ తో అనసూయ ఎంత పాపులర్ అయ్యారో తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయ్తో కాదేమో.అంతలా ప్రేక్షకులకు చేరువైన అనసూయ యాంకరింగ్తో పాటు సినిమాల్లో కూడా కీలక ఆఫర్లు దక్కించుకుంటూ ఒక్కో మెట్టు పైకెక్కుతున్నారు.ఇక తెరపై మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో అందంగా కనిపించడానికి ప్రయత్నించే అనసూయ అందులో భాగంగా తరచూ హాట్ ఫోజులతో తీయించుకున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు.ఈ క్రమంలో తాజాగా భర్త శశాంక్ భరద్వాజ్‌ కు హెడ్ మసాజ్ చేస్తుండగా తీసిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.అంతే గంటల వ్యవధిలో ఈ ఫోటో వైరల్గా మారగా నెటిజన్లు కూడా అంతే వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. శశాంక్ నేలపై కూర్చొని ఉండగా తొడలు ఒంటిపై కేవలం షర్ట్ మాత్రమే ధరించి ఉన్న ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.ఫోటోతో పాటు నా కొడుకు అయాంశ్ తీసిన ఈ ఫోటో నా కుటుంబం నాపై చూపే ప్రేమకు నిదర్శనమంటూ రాసుకొచ్చారు.అయితే తొడలు కనిపించేలా అనసూయ పోస్ట్ చేసిన ఫోటోపై అభిమానులు మరో రకంగా రియాక్ట్ అయ్యారు.అయ్యో పాపం బయటే కాదు ఇంట్లో కూడా వేసుకోవడానికి బట్టలు లేవు అంటూ ఒక అభిమాని కమెంట్ చేయగా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసే ముందు కాస్త డీసెన్స్ మెయింటెన్ చేయండంటూ మరొక నెటిజన్ పోస్ట్ చేశాడు.నీ కంటె నీ భర్త పొడవైనా షార్ట్ ధరించాడని నువ్వు మాత్రం షార్ట్ ధరించడం మరచిపోయావంటూ మరొకరు ఎద్దేవా చేశారు.నెటిజన్ల కమెంట్లపై అనసూయ ఇంకా స్పందించకపోయినా గతంలో కూడా అనసూయకు నెటిజన్లకు పలు విషయాలపై మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos