దోపిడీకి సిద్ధం..

  • In Film
  • May 8, 2019
  • 160 Views
దోపిడీకి సిద్ధం..

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కొత్త చిత్రం మహర్షి శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.భారీ బడ్జెట్తో పాటు చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉండడంతో మొదటి వారం రోజుల్లోనే వీలైనంత ప్రేక్షకుల నుంచి డబ్బులు దండుకోవడానికి థియేటర్ యాజమన్యాలు సిద్ధమయ్యాయి.హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహర్షి సినిమా టికెట్ల ధరలు అమాంతం పెంచేశారు.బుక్మై షో సంస్థతో పాటు మరికొన్ని ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థలు కూడా యథేచ్చగా టికెట్ ధరలు పెంచేశాయి.రూ.100 టికెట్లను రూ.125కు పెంచగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 టికెట్ను రూ.110కి పెంచాయి.ఇక మల్టీప్లెక్స్లలో రూ.138 నుంచి రూ.200 వరకు టికెట్ ధరలు పెంచేశాయి.హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలోనున్న ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.80 టికెట్ను రూ.150కి పెంచినట్లు బుక్మై షోలో చూపుతోంది.టికెట్ ధర రూ.125 చూపుతుండగా ఇతర ఛార్జీలతో కలిపి టికెట్ ధర రూ.150గా చూపుతోంది.పరీక్షలు ముగియడం పైగా వారంతం కావడంతో కుటుంబంతో కలసి సినిమా చూడడానికి వెళ్లే ప్రేక్షకుల నుంచి అందినకాడికి దోచుకోవడలే లక్ష్యంగా థియేటర్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అయితే మహర్షి సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్వయంగా ప్రకటించినా ఆన్లైన్ యాప్లలో టికెట్ల ధర పెంచడం చూస్తుంటే అనుమానం కలుగుతోంది.టికెట్ బుకింగ్ యాప్లలో పెరిగిన ధరలు చూశాక యాప్కు తమకు సంబంధం లేదని ప్రభుత్వం టికెట్ల ధర పెంచడానికి అనుమతించలేదంటూ ప్రకటించి చేతులు దుపులుకుంటారేమో చూడాలి.ఇదిలా ఉండగా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి థియేటర్ల యాజమాన్యాలు కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos