శ్రీకాకుళం :టెక్కలి పంచాయతీ పరిధి ఎన్టిఆర్ కాలనీకి చెందిన రావాడ అప్పలమ్మ (80) అనే వృద్ధురాలు చలి గాలులను తట్టుకోలేక శుక్రవారం మృతి చెందింది. ఫోని తుఫాను కారణంగా చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. పూరి పాకలు, పెంకుటిళ్లో జీవిస్తున్న వారికి తగిన దుప్పట్లు,రగ్గులు లేక పోవటంతో చలి గాలుల్ని తట్టుకోవటం చాలా కష్టంగా మారింది.