గాయంతో వైదొలగిన స్టెయిన్

  • In Sports
  • April 25, 2019
  • 133 Views
గాయంతో వైదొలగిన స్టెయిన్

బెంగళూరు : వరుస అపజయాల నుంచి కోలుకుంటున్న ఆర్‌సీబీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. జట్టులో ఆలస్యంగా ప్రవేశించిన దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ భుజం గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం రెండు మ్యాచులే ఆడిన స్టెయిన్‌, పవర్‌ ప్లేలోనే ప్రత్యర్థి వికెట్లు పడగొడుతూ జట్టులో హుషారు నింపాడు. ఇతను రాకముందు బౌలింగ్‌ విభాగంలో ఆర్‌సీబీ బలహీనంగా కనబడేది. బుధవారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచులో కూడా అతను ఆడలేదు. భుజం గాయంతో పాటు వచ్చే నెల 30 నుంచి ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్పు పోటీలు జరుగనుండడంతో ఐపీఎల్‌ నుంచి వైదొలగాలని స్టెయిన్‌ నిర్ణయించుకున్నాడని సమాచారం. దీంతో ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగానే ఉన్నాయని ఆర్‌సీబీ అనుకుంటున్న తరుణంలో ఈ వార్త పిడుగు పాటులా పరిణమించింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే తప్ప ఆర్‌సీబీకి ప్లేఆఫ్‌ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లినట్లే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos