కేరళ: శ్రీలంక బాంబుదాడి క్షతగాత్రలుకు వైద్య సేవలంచేందుకు 15మంది సభ్యుల వైద్య బృందాన్ని కేరళ ప్రభుత్వం అక్కడకు పంపదలచింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. పవిత్ర ఈస్టర్ పండుగనాడు విదేశీయులే లక్ష్యంగా చేసుకుని శ్రీ లంకలో ఉగ్రవాదులు ఎనిమిది చోట్ల జరిపిన ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 290 మంది మరణిచారు. 500 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.